అఖిల్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్..?

1 Mar, 2016 12:04 IST|Sakshi
అఖిల్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్..?

అక్కినేని మూడో తరం వారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అఖిల్. తొలి సినిమా అఖిల్తోనే సంచలనాలు నమోదు చేస్తాడని భావించిన ఆ సినిమా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. అఖిల్ ఆకట్టుకున్నా.., సినిమా రిజల్ట్ మాత్రం బెడిసికొట్టడంతో అక్కినేని ఫ్యామిలీ ఆలోచనలో పడింది. దీంతో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లను పరిశీలించిన అక్కినేటి టీం, ఫైనల్గా వంశీ పైడిపల్లికే ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో ఊపిరి సినిమా తెరకెక్కుతోంది. దీంతో వంశీ పైడిపల్లి వర్కింగ్ స్టైల్ మీద నమ్మకంతో అఖిల్ రెండో సినిమా అవకాశం ఇచ్చాడు నాగార్జున. ఇప్పటికే రెండో సినిమాకు సంబంధించి అఖిల్ లుక్పై ఫోటో సెషన్ కూడా పూర్తి చేశారట. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.