‘నీకు నచ్చినట్లు జీవించడం తప్పుకాదు’

18 Jun, 2020 15:18 IST|Sakshi

నటి వనితా విజయకుమార్‌ వివాహంపై వస్తోన్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఆమె కుమార్తె జోవికా.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. పెళ్లి చేసుకోబోతున్నందుకు శుభాకాంక్షలు అని.. ఎల్లప్పుడు తల్లికి మద్దతుగా నిలుస్తానని తెలిపింది. ఈ క్రమంలో జోవికా.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఏం జరిగినా నేను నీకు మద్దతుగా ఉంటాను. ప్రతిది నేను నీ నుంచే నేర్చుకున్నాను. నేను నీతో 15 సాహసోపేత సంవత్సరాలు గడిపాను. ముందు ముందు చాలా సంవత్సరాలు కలిసి జీవించాలి. మరెన్నో సాహసాలు చూడాలి. నీ గురించి నాకన్న బాగా ఎవరికి తెలియదు. నువ్వు చాలా దయ, ప్రేమ కల మనిషివని నేను నీకు చెప్తున్నాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించడంలో ఏలాంటి తప్పు లేదు. లవ్‌ యూ మా.. ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తల్లి పెళ్లి వార్తలను తెలపడమే కాక ఆమెకు మద్దతుగా నిలిచింది. (మళ్లీ పెళ్లికి సిద్ధమైన నటి !)

I'm counting my blessings

A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) on

సినీ పరిశ్రమకు చెందిన పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని వనిత వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 27న చెన్నైలోని వీరి నివాసంలో సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుంది.

మరిన్ని వార్తలు