ఇక నో సీక్రెట్‌

11 May, 2018 00:20 IST|Sakshi
నటాషా దలాల్‌, వరుణ్‌ ధావన్‌

తన చైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్‌ నటాషా దలాల్‌తో వరుణ్‌ ధావన్‌ లవ్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో బీటౌన్‌ మీడియా కోడై కూస్తోంది. వరుణ్, నటాషా కెమెరా కంట పడకుండా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, థియేటర్స్‌కు సీక్రెట్‌గా వెళుతున్నారని కూడా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు సీక్రెట్‌ మీటింగ్స్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టిందీ జంట. సోనమ్‌ కపూర్, ఆనంద్‌ అహూజా రిసెప్షన్‌ వేడుకకు వీరిద్దరూ జోడీగా హాజరయ్యారు. దీంతో ఇక నో సీక్రెట్స్‌ అని చెప్పకనే చెప్పారు వరుణ్‌ అండ్‌ నటాషా.

ఇలా  జంటగా నలుగురికీ కనిపించడంతో వరుణ్, నటాషా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబో తున్నారన్న కొత్త రాగం బాలీవుడ్‌లో మొద లైంది. రీసెంట్‌గా తాను హీరోగా నటించిన ‘అక్టోబర్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఏడాదిలో  వివాహం చేసుకుంటానేమోనని వరుణ్‌ చెప్పడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వంలో ‘కళంక్‌’ సినిమాలో నటిస్తున్నారు వరుణ్‌«. ఈ సినిమాలో న్యూ లుక్‌ కోసం ఆయన స్పెషల్‌ వర్కౌట్స్‌ చేస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు