చెప్పు కట్టు

11 May, 2018 00:20 IST|Sakshi

న్యూలుక్‌

సిల్క్‌ దారాలతో గాజులను చుట్టి అందంగా అలంకరించడం తెలిసిందే కదా! అలాగే పాత శాండల్స్‌ని, చెప్పులను ముఖ్యంగా స్లిప్పర్స్‌ని కొత్తగా మార్చేయవచ్చు. వేసవి కాలం పాదాలకు చెమట, రబ్బర్‌ మూలంగా దురద వంటి సమస్యల నుంచి కూడా ఈ పద్ధతి వల్ల తప్పించుకోవచ్చు. అంతెందుకు ఇంటికి మాత్రమే పరిమితమైన స్లిప్పర్స్‌ని ఇలా దారాలతో చుట్టేసి బయటకు కూడా వేసుకెళ్లవచ్చు. 


కావల్సినవి
∙రబ్బర్‌ శాండల్స్‌  స్వెటర్‌ అల్లికకు ఉపయోగించే రంగు రంగు నూలు దారాలు  గ్లూ (చివర్లను అతికించడానికి)

ఇలా మొదలెట్టాలి..
శాండల్స్‌ (0 ఫొటో)
స్టెప్‌ 1: నచ్చిన రంగు దారాన్ని తీసుకోవాలి.
స్టెప్‌ 2: చెప్పుల స్ట్రాప్‌ పైన, కింది భాగాల్లో గ్లూని పూయాలి. (కొద్ది కొద్దిగా గ్లూ వాడుతూ, దారాన్ని ఉపయోగించాలి)
స్టెప్‌ 3: దారాన్ని ముందుగా స్ట్రాప్‌ కిందిభాగంలో అతికిస్తూ పైనుంచి తీయాలి. గ్లూ ని ఉపయోగిస్తూ దారాన్ని స్ట్రాప్‌ చుట్టూ తిప్పుతూ సెట్‌ చేయాలి. ఎంపిక చేసుకున్న మరో రంగు దారంతో ఇలాగే చుట్టాలి. రెండో వైపు స్ట్రాప్‌ని కూడా పై విధంగా చుట్టి, గ్లూతో చివరలను అతికించాలి. దారాలన్నీ సెట్‌ అయ్యాయా లేదా సరిచూసుకోవాలి.
స్లిప్పర్‌ స్ట్రాప్స్, బ్యాగ్‌ హ్యాండిల్స్‌ని ఇలా రంగు రంగు నూలు దారాలతో చుట్టేసి కొత్తగా మార్చేయవచ్చు. వేసవికి సౌకర్యంతో పాటు స్టైల్‌గానూ ఉంటాయి. 
ప్లాస్టిక్‌ పువ్వులను కుట్టి మరింత అందాన్ని తీసుకురావచ్చు. 

మరిన్ని వార్తలు