వెంకటేష్, రామ్ 'మసాలా' ఫస్ట్ లుక్

9 Aug, 2013 19:51 IST|Sakshi
వెంకటేష్, రామ్ 'మసాలా' ఫస్ట్ లుక్

వెంకటేష్, రామ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఫస్ట్ లుక్ విడుదలయింది. ఫేస్ బుక్లోని గరమ్ మసాలా పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఈ సినిమా హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కు ఇది రీమేక్. విజయభాస్కర్ దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, షాజన్ పదమ్‌సి కథానాయికలు.
 
ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంతవరకూ అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. అయితే ఇప్పటికే  ‘గోల్‌మాల్’, ‘గరం మసాలా’, ‘రామ్-బలరామ్’, ‘సర్వేజనా సుఖినోభవంతు’, ‘బ్లాక్‌బస్టర్’ తదితర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.
 
అయితే దర్శక నిర్మాతలు ఇంకా ఏదీ ధ్రువీకరించలేదు. అయితే... ఫైనల్‌గా ‘మసాలా’ టైటిల్ ఓకే అయ్యే అవకాశం ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ఇటీవలే థాయ్‌లాండ్‌లో ఓ పాట చిత్రీకరించారు. బ్యాలెన్స్ ఒక్క పాటను ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఈ నెల 17న పాటలను విడుదల చేసే యోచనలో ఉన్నారు.