నా పిల్లలకు కాబోయే తల్లి నయన్‌: విఘ్నేశ్‌

11 May, 2020 15:38 IST|Sakshi

అమ్మా.. లవ్‌ యూ.. నయన్‌ తల్లికి విఘ్నేశ్‌ శివన్ విషెస్‌

‘‘నాకు పుట్టబోయే పిల్లలకు అమ్మ అయినటువంటి మహిళ చేతిలో ఉన్న పాపాయి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ కోలీవుడ్‌ దర్శకుడు, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌ శివన్ మదర్స్‌ డే విషెస్‌ చెప్పారు. బిడ్డను ఎత్తుకుని కెమెరా వైపు చూస్తున్న నయన్‌ ఫొటోకు ఈ విధమైన క్యాప్షన్‌ జత చేశారు. అంతేగాక నయన్‌తో పాటు ఆమె తల్లికి కూడా విఘ్నేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందమైన ఈ చిన్నారిని ప్రపంచంలోకి తీసుకువచ్చినందుకు మీకు ధన్యవాదాలు మిసెస్‌ కురియన్‌. లవ్‌ యూ అమ్మా’’ అని ఆమెపై ప్రశంసలు కురిపించారు. కాగా నానుమ్‌ రౌడీదాన్‌ సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌, విఘ్నేశ్‌ ప్రేమలో పడినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.(పెద్ద మనసు చాటుకున్న నయనతార)

అయితే తమ ప్రేమ గురించి ఎప్పుడూ బాహాటంగా ప్రకటించని ఈ జంట.. వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరులో వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది. అయితే అప్పుడు కూడా నయన్‌, విఘ్నేశ్‌ నేరుగా ఈ విషయంపై స్పందించలేదు. ఇక ప్రస్తుతం తనకు పుట్టబోయే పిల్లలకు నయన్‌ అమ్మ అంటూ విఘ్నేశ్‌ పేర్కొనడంతో వీరి పెళ్లికి సర్వం సిద్ధమైనట్లేనంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా నటిగా నయనతార, కథా రచయిత, డైరెక్టర్‌గా విఘ్నేష్‌ తమ తమ రంగాల్లో దూసుకుపోతూ కెరీర్‌పై దృష్టి సారిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.(స్టార్‌ హీరోయిన్‌తో ఐదేళ్ల ప్రేమాయణం..!)

Happy Mother’s Day to the mother of the child in the hands of the mother of my future children ... 🥳🥳🥰🥰🤗🤗😌😌😌😌 #Happymothersday #mothersday #happymothersday

A post shared by Vignesh Shivan (@wikkiofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా