తెలుగు నేర్చుకుంటున్న తమిళ హీరో

5 Mar, 2017 11:50 IST|Sakshi
తెలుగు నేర్చుకుంటున్న తమిళ హీరో

ప్రస్తుతం కోలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ న్యూ సెన్సేషన్ విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా భారీ కలెక్షన్లు సాధించటంతో తన ప్రతీ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు తన సినిమాలను డబ్ చేసి మాత్రమే రిలీజ్ చేసిన విజయ్, నెక్ట్స్ సినిమాను బైలింగ్యువల్ తెరకెక్కిస్తున్నాడు.

ఇంద్రసేన పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఆంటోని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శ్రీనివాసన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న విజయ్, ఈ సినిమాలోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందుకే స్పెషల్గా టైం కేటాయించి తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్ ఆంటోని స్ట్రయిట్ సినిమాతో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి