100 కోట్ల క్లబ్‌లో బిగిల్‌

30 Oct, 2019 10:05 IST|Sakshi

పెరంబూరు: బిగిల్‌ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బిగిల్‌. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ భారీఎత్తున నిర్మించింది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 4 వేల థియేటర్లలో విడుదలయ్యింది. పూర్తిగా కమర్శియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ అభిమానులను  విపరీతంగా అలరిస్తోంది. కాగా చిత్ర వసూళ్లు మొదటి రోజున కాస్త పలుచగా ఉన్నా, రెండవ రోజు నుంచి పెరిగాయి. దీంతో విడుదలైన 3 రోజుల్లోనే బిగిల్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా  రూ.100 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం.  దీనితోపాటు విడుదలయిన ఖైదీ చిత్రం కూడా మంచి టాక్‌తో ప్రదర్శింపబతున్నా, దీపావళికి ఈ రెండు చిత్రాలే తెరపైకి రావడంతో బిగిల్‌ చిత్ర వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితుల గణాంకాలు చెబుతున్నాయి.

నటుడు విజయ్‌ ఇంటికి బాంబు బెందిరింపు..
కాగా నటుడు విజయ్‌ ఇంటికి బాంబు అంటూ ఫోన్‌కాల్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. స్థానిక సాలిగ్రామంలోని నటుడు విజయ్‌ తండ్రి ఇంటికి, నీలాంగరైలోని విజయ్‌ ఇంటికి గట్టి పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.  ఈ వివరాలు చూస్తే గత 26వ తేదీ రాత్రి చెన్నై పోలీస్‌ కార్యాలయానికి ఒక వ్యక్తి ఫోన్‌ చేసి నటుడు విజయ్‌ ఇంటిలో బాంబు పెట్టినట్లు చెప్పి పెట్టేశాడు. దీంతో పోలీసులు స్థానికి సాలిగ్రామంలోని విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ ఇంటికి, నీలాంగరైలోని విజయ్‌ ఇంటికి పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేశారు. బాంబుస్క్వాడ్‌ను పిలిపించి, పోలీస్‌కుక్కలతో రెండు చోట్లా ఇళ్లను క్షణంగా పరిశోధించారు. అయితే బాబు లేదని విచారణలో తెలడంతో ఫోన్‌ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యకి అన్నానగర్‌కు చెందిన వాడని తెలియడంతో అతన్ని పిలిపించి విచారించారు. అయితే ఎవరో ఒక వ్యక్తి సడన్‌గా వచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడాలని ఫోన్‌ తీసుకున్నాడని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు తను చెప్పింది నిజమేనా? అన్న విషయం గురించి తీవ్రంగా విచారిస్తున్నారు. బాంబు పెట్టడం అన్నది బూచి అని తేలయడంతో విజయ్‌ ఇంటికి ఏర్పాటు చేసిన పోలీస్‌బందోబస్తును వాపస్‌ చేశారు,

మరిన్ని వార్తలు