కేసీఆర్‌ కోసం బాహుబలి రైటర్‌

27 Mar, 2018 17:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు బయోపిక్‌ కోసం దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఈ చిత్రం కోసం సీనియర్‌ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నివాస్‌ డైరెక్ట్‌ చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం విజయేంద్ర వర్మతో నివాస్‌ చర్చించగా.. ఫోటో ఒకటి వైరల్‌ అవుతోంది. తొలుత ఈ చిత్రాన్ని కేవలం డాక్యుమెంటరీగానే చిత్రీకరించాలని నిర్మాతలు భావించారు.

అయితే చివరకు దీనిని కమర్షియల్‌ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. బాహుబలి రైటర్‌ ఎంట్రీతో ఆ పని మరింత సులువు కానుంది. తారాగణం, మిగతా టెక్నీషియన్లపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు