అతివేగానికి కళ్లు బైర్లుకమ్మే ఫైన్‌

27 Mar, 2018 18:03 IST|Sakshi

దుబాయ్‌: కారును గంటకు 83కిలోమీటర్ల వేగంతో నడిపినందుకు దుబాయ్‌ ట్రాఫిక్‌ అధికారులు ఓ కారు డ్రైవర్‌కు 3000 ధీరమ్‌(భారత రూపాయిల్లో 53 వేల పైనే) ల జరిమాన విధించారు. వివరాలు, దుబాయ్‌లోని కోర్నిచే అల్‌ ఖ్వసిమ్‌ రోడ్‌లో ఓ కారు డ్రైవర్ వాహనాన్ని గంటకు 83 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. నిబంధనల ప్రకారం ఆ రోడ్డులో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వాహనాలను నడపాలి.

గతంలో గంటకు 60 కిలోమీటర్ల నిబంధన ఉంది, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ట్రాఫిక్‌ నిబంధనలు విధించే సంస్థ. దుబాయ్‌లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం అతివేగం కారణంగానే జరుగుతున్నట్టు దుబాయ్‌ ట్రాఫిక్‌ నియంత్రణ అధికారులు తెలిపారు. అతివేగంతో వాహనాలను నడిపే వారు అత్యధికంగా యువకులు, లైసెన్స్‌ లేని వారేనని అధికారుల పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన ట్రాఫిక్‌ పెట్రోలింగ్‌లో 69 మంది యువకులు లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతూ.. పట్టుబడినట్టు అక్కడి పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు