నవంబర్‌ 1న స్టార్‌ హీరో కూతురి వివాహం

28 Oct, 2017 12:43 IST|Sakshi

కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం నవంబర్‌ 1న జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు అవుతున్నారు. సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుటుంబానికి చెందిన మను రంజిత్, అక్షిత ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారు. కాగా, మను రంజిత్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు. ఇప్పటికే విక్రమ్‌ కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. విక్రమ్‌ కూడా షూటింగ్‌ల నుంచి బ్రేక్‌ తీసుకొని కూతురి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు