స్పీడ్‌ పెంచిన విక్రమ్‌

1 Nov, 2023 10:29 IST|Sakshi

నటుడు విక్రమ్‌ వరుస సనిమాలు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం విజయం ఈయనలో నూతనోత్సాహాన్ని పెంచింది. దీంతో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. విక్రమ్‌ కథానాయకుడిగా చాలా కాలం నిర్మాణంలో ఉన్న ధృవనక్షత్రం చిత్రం విడుదలకు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటోంది. త్వరలో ఈ చిత్రం తెరపై రానుందని సమాచారం.

కాగా తాజాగా పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం తంగలాన్‌ సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల కానుంది. కేఈ. జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తాజాగా చిత్తా చిత్రం ఫేమ్‌ యు.అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వెలువడింది.

ఇదిలా ఉంటే విక్రమ్‌ తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. ఇంతకు ముందు హిప్‌హాప్‌ తమిళా ఆది హీరోగా నటించిన అన్బరివు చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలిసింది. దీన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనుంది సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా విక్రమ్‌ అభిమానులు తంగలాన్‌ చిత్రం విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు