మధ్య తరగతి అమ్మాయి కథ

26 May, 2019 00:38 IST|Sakshi
నందితా రాజ్‌

రాజకిరణ్‌ సినిమా పతాకంపై ఫణి తిరుమల శెట్టి సమర్పిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్‌ ఎస్, రాజకిరణ్‌ నిర్మిస్తున్నారు. ’గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్‌ దర్శకత్వం వహించారు. ‘‘సాధారణ మధ్యతరగతి అమ్మాయి జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని సమస్యలు ఆమెను వేధిస్తాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు అందని సృష్టి రహస్యాలు ఏంటి? అనేది థియేటర్‌లో చూడాల్సిందే’’ అని చిత్రబృందం పేర్కొంది.

ఇటీవల సినిమా సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్‌ లభించిన ఈ చిత్రాన్ని జూన్‌ 14న  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ‘విశ్వామిత్ర’. మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నందితా రాజ్‌ చేశారు. ‘సత్యం’ రాజేశ్, అశుతోష్‌ రానా, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా లవ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సినిమా రూపొందింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

మరిన్ని వార్తలు