నా జీవితంలో నువ్వో మ్యాజిక్‌

26 May, 2019 00:45 IST|Sakshi
అమల

నాగార్జునకు 33 ఏళ్లు. అవును.. నటుడు నాగ్‌ వయసు ఇది. ‘విక్రమ్‌’ (23 మే 1986 రిలీజ్‌) సినిమాతో హీరో అయిన నాగ్‌ ఈ మే 23తో నటుడిగా 33 ఏళ్ల ప్రయాణాన్ని కంప్లీట్‌  చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త నాగార్జున గురించి ఆయన సతీమణి అమల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ సారాంశం ఈ విధంగా...‘‘నా హీరో, నా భర్త, నా స్నేహితుడు... నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావు. నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగావు. నువ్వు స్క్రీన్‌పై కనబడితే ఇప్పటికీ నా చూపు తిప్పుకోలేకపోతున్నా.

నీ స్టైల్, నీ స్మైల్, నీ కళ్లలోని మెరపుని చూసేందుకు ఇప్పటికీ నా గుండె తపిస్తూనే ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నీ అందం ఇంకా పెరుగుతూనే ఉంది. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో మాకు నువ్వు ఓ ఉదాహరణగా నిలిచావు. మిస్టరీ, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా జానర్‌ ఏౖదైనా నీ సినిమా విడుదలవుతున్న ప్రతిసారీ ఎలా కనిపించబోతున్నావో అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటాను. శ్రీ వెంకటేశ్వరస్వామికి, రాముడికి, షిరిడీ సాయికి నన్ను పరిచయం చేశావు.

ఆ దేవుళ్లు మన కుటుంబంలో భాగమ య్యారు (‘అన్నమయ్య, షిరిడి సాయి, శ్రీరామదాసు’ చిత్రాల్ని ఉద్దేశిస్తూ). కంటెంట్‌ ఉన్న కథలను ఇస్తున్నావు. మా అంచనాలను మించి చేస్తున్నావు. నీ పాత్రల పరంగా 2 గంటల అమూల్యమైన సమయాన్ని మాకు ఎంటర్‌టైనింగ్‌గా అందిస్తున్నావు. ఓడిపోతానేమోనని నువ్వెప్పుడూ భయపడలేదు. ఎందుకంటే ది బెస్ట్‌ ఇస్తావ్‌ కాబట్టి. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి నువ్వు వెనకాడలేదు.

అనుకున్న సమయానికి సినిమాలను రిలీజ్‌ చేయడంలోనూ నువ్వు విఫలం కాలేదు. నీ నిర్మాతను తగ్గనివ్వలేదు. నీలాంటి నటుల వల్ల సినిమాల్లో ఫన్, మ్యాజిక్, గ్లామర్‌ ఉంటున్నాయి. నా లైఫ్‌లో నువ్వో మ్యాజిక్‌. ఇండస్ట్రీలో 33 ఏళ్లు పూర్తిచేసుకుని, 95 సినిమాల్లో నటించినందుకు శుభాకాంక్షలు మై స్వీట్‌హార్ట్‌. క్లింట్‌ ఈస్ట్‌ ఉడ్, మిస్టర్‌ అమితాబ్‌ బచ్చన్, ఏయన్నార్‌లా సినిమాల్లో నువ్వింకా ఏన్నో ఏళ్లు పూర్తి చేసుకోవాలి. గోల్డెన్‌ స్కై కింద నీ రైడ్‌ సాగుతోంది. ఇది కేవలం సగం దూరం మాత్రమే.
మై హీరో, మై ఫ్రెండ్‌.
ప్రేమతో నీ అభిమాని
అమల

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా