15ఏళ్ల తర్వాత లోకల్‌ రైలులో హీరో

19 Mar, 2017 20:34 IST|Sakshi
15ఏళ్ల తర్వాత లోకల్‌ రైలులో హీరో

ముంబయి: దాదాపు పదిహేనేళ్ల తర్వాత బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ లోకల్‌ రైలులో ప్రయాణించారు. తన కలల ప్రాజెక్టు అయిన కర్మ్‌ బ్రహ్మాండ్‌ హౌజింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆయన లోకల్‌ రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన అమితానందాన్ని వ్యక్తం చేశారు. సాధారణ పౌరులకు అతి తక్కువ ధరకే ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ముంబయిలోని బీచ్‌ పక్కనే దాదాపు ఐదు వేల నివాసాల బృహత్తర ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను వెళుతున్నానని, ఇది తన జీవిత కల అని తెలిపారు.

కెల్వ్‌ రోడ్డులోని లోకల్‌ రైలులో సెకండ్‌ క్లాస్‌లో వివేక్‌ ఒబెరాయ్‌ మీడియా ప్రతినిధులతో సహా వెళ్లారు. ఆయన 2002లో సాతియా అనే చిత్రం షూటింగ్‌ సమయంలో చివరిసారిగా లోకల్‌ రైలు ఎక్కారంట. ‘ఎంతో మంది పేదవారు, సామాన్యులు అసురక్షితమైన జీవితాన్ని కఠిన పరిస్థితుల మధ్య బతికేస్తున్నారు. కెల్వ్‌ రోడ్డు మాదిరిగానే షాపూర్‌ కూడా మారిపోయింది. 2018 నుంచి దాదాపు 14,000 వేల కుటుంబాలు నాణ్యమైన జీవితాన్ని ప్రారంభిస్తారు’ అని వివేక్‌ చెప్పారు.