పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!

2 Sep, 2019 12:18 IST|Sakshi

ముంబై : సల్మాన్‌ ఖాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ జరీన్‌ ఖాన్‌కు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. రాజస్తాన్‌లో దిగిన ఫొటోలను ‘సిటీ ఆఫ్‌ లేక్స్‌’ క్యాప్షన్‌తో జరీన్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేశారు. జీన్స్‌ బాటమ్‌కు జతగా వైట్‌ క్రాప్‌టాప్‌ ధరించిన ఆ ఫొటోలో.. జరీన్‌ పొట్ట భాగం కనిపించడంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ‘పొట్టపై ఆ కుట్లు ఏంటి? లావు తగ్గేందుకు సర్జరీ చేయించుకున్నావా? అసలు అంతలా లావెక్కడం ఎందుకు’ అంటూ ఇష్టారీతిన బాడీ షేమింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ట్రోల్స్‌కు హుందాగా స్పందించిన జరీన్‌...‘ నా పొట్టకు ఏమైందో తెలుసుకోవాలని ఎంతో మంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. 50 కిలోలకు పైగా బరువు తగ్గిన వ్యక్తి పొట్ట సహజంగానే ఇలా ఉంటుంది. ఈ ఫొటోను ఫొటోషాప్‌ చేయలేదు అలాగే సర్జరీ కూడా చేయించుకోలేదు. నా అసలైన రూపాన్ని, సహజత్వాన్ని మాత్రమే నేను ఇష్టపడతాను. ఒకవేళ లోపాలు ఉన్నా..వాటిని కవర్‌ చేయాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి బాడీ షేమింగ్‌ చేయడం మానేయండి’ తన ఇన్‌స్టాస్టోరీలో రాసుకొచ్చారు. 

ఈ క్రమంలో జరీన్‌ అభిమానులతో పాటు పలువరు బాలీవుడ్‌ ప్రముఖులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. జరీన్‌ నువ్వు చాలా అందంగా ఉంటావు. ధైర్యవంతురాలివి కూడా. ఎప్పుడు ఇలాగే పర్ఫెక్ట్‌గా ఉండు అంటూ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ జరీన్‌కు బాసటగా నిలిచారు. బొద్దుగా ఉన్ననాటి, బరువు తగ్గిన తర్వాత జరీన్‌ పోస్ట్‌ చేసిన ఫొటోలను షేర్‌చేస్తూ.. ‘ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరంగా బరువు తగ్గిన మీరు మాకు ఆదర్శం’ అంటూ పలువరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ పోలికలతో ఉండే జరీన్ ఖాన్‌ను సల్మాన్‌ తన ‘వీర్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అనిల్ శర్మ తెరకెక్కించిన ఈ పిరియాడిక్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇక వీర్‌ తర్వాత సల్మాన్ మరో సినిమా ‘రెడీ’ సినిమాలో అవకాశం దక్కించుకున్న జరీన్‌ హౌజ్‌ఫుల్‌ 4 వంటి పలు చిత్రాల్లో కనిపించారు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జరీన్‌.. గోపీచంద్‌ తాజా సినిమా ‘చాణక్య’తో తెలుగు తెరపై కూడా సందడి చేయనున్నారు.

City Of Lakes ! #LakePichola #Udaipur #Rajasthan #IncredibleIndia #JeepBollywoodTrails #TravelWithZareen #WanderLust #HappyHippie #ZareenKhan @jeepindia @dbhatnagar @urvashikhanna

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా!

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!

న్యూ ఏజ్‌ లవ్‌

లుక్‌పై ఫోకస్‌

మిస్టర్‌ రావణ

ప్రతీకారం తీర్చుకునే చాన్స్‌ ఇచ్చిన రమ్యకృష్ణ

విడిపోయి కలిసుంటాం: దియా మీర్జా

బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

టీనేజ్‌లోకి వచ్చావ్‌.. ఎంజాయ్‌ చెయ్‌

ష్వార్జ్‌నెగ్గర్‌ స్ఫూర్తిదాత మృతి

పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో

‘మిస్టర్ రావణ’గా మిస్టర్ వరల్డ్‌

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘శివగామి’

లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘#బాయ్స్‌’

వాళ్ల బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది : సల్మాన్‌

తొలి రోజే వంద కోట్లు.. ‘సాహో’ ప్రభాస్‌!

‘సాహో’ టాక్‌‌.. ఆ సెంటిమెంట్లే కారణమా!

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌