గణేశ్‌ నిమజ్జనంలో తీవ్ర విషాదం : 11 మంది మృతి

13 Sep, 2019 08:34 IST|Sakshi

భోపాల్‌ : గణేశ్‌ నిమజ్జనోత్సవం సందర్భంగా భోపాల్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భోపాల్‌లోని ఖట్లపురా ఘాట్ వద్ద పడవ బోల్తా పడటంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. భోపాల్‌ ఐజీ యోగేష్‌ దేశ్‌ముఖ్‌ అందించిన సమాచారం ప్రకారం  పడవలో మొత్తం 16 మంది  ఉన్నారు. వీరిలో 11మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారి కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో అయిదుగురి ఆచూకీ గల్లతైంది. వీరి ఆచూకీ కోసం గత ఈతగాళ్లు శ్రమిస్తున్నారు. ఎస్‌డిఇఆర్‌ఎఫ్ సిబ్బంది, పోలీసులు ప్రస్తుతం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.  ఈ విషాదంపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

మరిన్ని వార్తలు