గ్రామాన్ని ఖాళీ చేసిన ముస్లింలు

11 Oct, 2017 14:14 IST|Sakshi

రాజస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు

జానపద గాయకుడిని హత్య చేసిన వైనం

హిందూ దేవీదేవతల గీతాలపై వక్ర భాష్యం

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 200 ముస్లిం కుటుంబాలు గ్రామాన్ని వదలి వలస వెళ్లినట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. నెల రోజుల కిందట  జానపద గాయకుడిని ఒక అర్చకుడు, అతని మిత్రులు హత్య చేయడంతో అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెబుతున్నవివరాలివి.

రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ జిల్లా,  ఫోఖ్రాన్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది దంతాల్‌ గ్రామం. ఈ పల్లెటూరు భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉండడం గమనార్హం.  హిందూ దేవీదేవతల స్త్రోత్రాలు, మంత్రాలు, శ్లోకాలకు  గాయకుడు అహ్మద్‌ ఖాన్‌ (45) రాగయుక్తంగా పాడేవాడు కాదు. ఇలా పాడడం తప్పని ఆలయ పండితుడు రమేష్‌ సుథార్‌ పలుసార్లు ఆతనికి వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అర్చకుడు రమేష్‌ సుథార్‌, అతని మిత్రులు కలిసి అహ్మద్‌ఖాన్‌పై సెప్టెంబర్‌27 దాడి చేశారు. ఈ దాడిలో అహ్మద్‌ ఖాన్‌ అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తరువాత గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడినట్లు సీనియన్‌ పోలీస్‌ అధికారి గౌరవ్‌ యాదవ్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును ఆయనే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అర్చకుడు రమేష్‌ సుథార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. రమేష్‌ కుటుంబ సభ్యులు సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతిలో ఉన్నారని.. ఈ కేసు గురించి మాట్లాడేందుకు వారు ఇష్టపడడం లేదని గౌరవ్‌ అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇక్కడకు పారామిలటరీ బలగాలను తెప్పించామన్నారు.

ఇదిలావుండగా.. తమ సోదరుడు చేసిన చిన్న పొరపాటుకు దారుణంగా హత్య చేశారని అహ్మద్‌ఖాన్‌ సోదరి రఖాఖాన్‌ చెప్పారు. ఇకపై ఈ గ్రామంలో జీవించలేమని.. అందుకే ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నామని ఆమె ఆవేదనగా చెప్పారు.

మరిన్ని వార్తలు