ఆధార్‌కు వయసు ధ్రువీకరణ తప్పనిసరి కాదు

25 May, 2017 01:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డు దరఖాస్తు సమయంలో వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరేమీ కాదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తెలిపింది.

మనదేశంలో చాలామందికి పుట్టినరోజు, సంవత్సరం తెలియదని.. అలాంటి సందర్భంలో తమ నిబంధనలకు అనుగుణంగా వివరాలు అందించాలని యూఐడీఏఐ ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కంజసా గ్రామంలో ప్రతి ఐదుగురిలో ఒకరి పుట్టినరోజు జనవరి 1న ఉండడంపై ఆయన స్పందించారు. దరఖాస్తుదారు అందించిన వివరాల ఆధారంగానే ఆధార్‌కార్డులు జారీచేస్తామన్నారు.

మరిన్ని వార్తలు