‘ఉగ్ర నిధులకు కోత’

14 Oct, 2019 11:31 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉగ్రవాదులను మట్టికరిపించాలంటే వారి సిద్ధాంతంతో పోరాడాల్సిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చెప్పుకొచ్చారు. ‘ఉగ్రవాదం కొత్తేమీ కాదు..ఉగ్రవాదుల నుంచి ఆయుధాన్ని..వారి భావజాలాన్ని దూరం చేసినప్పుడే ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీయగల’మని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కార్యక్రమంలో పాల్గొన్న దోవల్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడటం ఒక్కటే సరిపోదని ఉగ్ర నిధులను నియంత్రించి వారిని ఏకాకులుగా చేయాలని చెప్పారు. నేరస్తుడికి ప్రభుత్వ ఊతం లభిస్తే మరింత చెలరేగుతాడని, అది ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత సంక్లిష్టం చేస్తుందని అన్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ప్రభుత్వాలు ఆరితేరాయని, దురదృష్టవశాత్తూ పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ప్రభుత్వ విధానంగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాద నిరోధక బృందాల చీఫ్‌లు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దోవల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు