రాహుల్‌కు అమిత్‌ షా సవాల్‌..

3 Jan, 2020 15:35 IST|Sakshi

జోధ్‌పూర్‌ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దమ్ముంటే తనతో చర్చకు రావాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సవాల్‌ విసిరారు. పౌర చట్టంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పౌర చట్టానికి మద్దతుగా శుక్రవారం జోథ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్‌ షా ప్రసంగిస్తూ ఈ చట్టంపై అపోహలు వీడాలని కోరారు. ఏ ఒక్కరి పౌరసత్వాన్ని నూతన చట్టం లాగేసుకోదని భరోసా ఇచ్చారు.

సీఏఏపై దేశవ్యాప్త అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా జోథ్‌పూర్‌ ర్యాలీలో అమిత్‌ షా సీఏఏను గట్టిగా సమర్ధించారు. ఈ చట్టాన్ని వెనక్కుతీసుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మోదీ సర్కార్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల తోడ్పాటు అవసరమని పిలుపు ఇచ్చారు. మోదీ అభివృద్ధిని ప్రజలు ప్రోత్సహించాలని, దేశ పురోగతి కోసం ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.

>
మరిన్ని వార్తలు