చెన్నైలో ప్రాచీన విగ్రహాలు స్వాధీనం

1 Jun, 2016 01:43 IST|Sakshi
చెన్నైలో ప్రాచీన విగ్రహాలు స్వాధీనం

విలువ రూ. 50 కోట్లకు పైనే
 
 సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రాచీన విగ్రహాలను విదేశాలకు అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును తమిళనాడు పోలీసులు రట్టు చేశారు. చెన్నై, ఆళ్వార్‌పేటలోని ముఠా నాయకుడి ఇంటిపై మంగళవారం దాడులు నిర్వహించి రూ. 50 కోట్ల విలువైన 54 ప్రాచీన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీనదయాళన్ 2005లో విగ్రహాల తరలింపు కేసులో అరెస్టయినట్లు గుర్తించారు. ఇతని ముఠాలోని సభ్యులైన మాన్‌సింగ్, కుమార్, రాజామణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 చోరీ విగ్రహం.. మోదీకి కానుక: పంజాబ్‌కు చెందిన సుభాష్‌కపూర్ తమిళనాడులో దొంగిలించిన నటరాజ, అర్ధనారీశ్వర విగ్రహాలనుఆస్ట్రేలియాలో అమ్మినట్లు, ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లిన ప్రధాని మోదీకి ఈ రెండు విగ్రహాలను అక్కడి ప్రభుత్వం బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు