మహిళా అధికారి హత్య కేసులో మాజీ డ్రైవర్ అరెస్టు

6 Nov, 2023 12:45 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకా అధికారి కేఎస్‌ ప్రతిమ(43) హత్య కేసులో అమె వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పనిలో నుంచి తీసేసిన కక్షతోనే నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు నేరాన్ని కూడా అంగీకరించినట్లు సమాచారం.

నిందితుడు కిరణ్ గత ఐదేళ్లుగా గవర్నమెంట్ కాంటాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారి ప్రతిమ గత పది రోజుల క్రిందటే కిరణ్‌ను విధుల నుంచి తప్పించారని వెల్లడించారు. అతని స్థానంలో మరో ఉద్యోగిని నియమించుకున్నట్లు తెలిపిన పోలీసులు.. ఈ కక్షతోనే నిందితుడు ప్రతిమను హత్య చేశారని అనుమానిస్తున్నారు. హత్య అనంతరం బెంగళూరు నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్‌కు పారిపోయినట్లు గుర్తించారు. 

కర్ణాటకాలో గనులు, భూవిజ్ఞాన శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న కేఎస్‌ ప్రతిమ(43) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ  దారుణ హత్య జరిగింది. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు కార్యాలయం నుంచి ఇంటికి ప్రతిమను కారులో డ్రైవరు డ్రాప్‌ చేసి వెళ్లాడు. కాసేపటికే ప్రతిమపై దాడి చేసిన కొందరు వ్యక్తులు.. ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.  

ఇదీ చదవండి:  కర్ణాటకలో కలకలం.. మహిళా అధికారి దారుణ హత్య

మరిన్ని వార్తలు