మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?

12 Dec, 2019 02:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 అంటే ఏమిటి ?, అయోధ్య కేసు ఏమిటి ?, జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ) అంటే ఏమిటి ? ఇవీ గూగుల్‌ను భారతీయులు ఎక్కువగా అడిగిన ప్రశ్నలు. 2019ఏడాదికిగాను వీటి గురించే అత్యధికంగా వెదికారని గూగుల్‌ 2019 నివేదిక తెలిపింది. ఎగ్జిట్‌ పోల్స్, బ్లాక్‌హోల్, హౌడీ–మోడీలను శోధించారు. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌తోపాటు లోక్‌సభ ఎన్నికల గురించి అత్యధిక మంది సెర్చ్‌ చేశారు. ఓటేయడం ఎలా ? ఓటరు లిస్టులో పేరును ఎలా చూసుకోవాలి వంటి ప్రశ్నలను గూగుల్‌ను అడిగారు. చంద్రయాన్‌–2, నీట్‌ ఫలితాలు, పీఎం కిసాన్‌ యోజన, కబీర్‌ సింగ్, అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్, కెప్టెన్‌ మార్వెల్‌ గురించీ వెదికారు. వ్యక్తుల గురించి చేసిన శోధనలో.. ‘ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌’  తొలిర్యాంక్‌ సాధించారు. తర్వాత లతా మంగేష్కర్, యువరాజ్‌ సింగ్, ‘సూపర్‌ 30’ ఆనంద్‌‡ వంటివారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగాచూస్తే గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ టీవీ షో గురించి వెదికారు.

మరిన్ని వార్తలు