'కశ్మీర్ నిర్ణయంలో శ్యామా ప్రసాద్ భాగస్వామే'

1 Jul, 2016 20:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి అప్పగిస్తూ నిర్ణయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా భాగస్వాముడేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీ నేతల చరిత్రను ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలుసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి హితవు పలికారు. కశ్మీర్ అంశంపై నిర్ణయాన్ని జవహర్‌లాల్ నెహ్రూ నే తృత్వంలోని కేబినెట్ తీసుకుందని, అందులో ముఖర్జీ కూడా సభ్యుడేనని ఆయన చెప్పారు.

కశ్మీర్‌పై నిర్ణయ సమయంలో ముఖర్జీ అభ్యంతరం చెప్పలేదని, ఆనాటి పత్రికల్లో కూడా అలాంటి వార్తలేమీ రాలేదన్నారు. అందువల్ల కశ్మీర్ నిర్ణయంలో ముఖర్జీ కూడా భాగస్వామేనని తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాపై నిర్ణయ సమయంలోను నెహ్రూ కేబినెట్‌లో ముఖర్జీ సభ్యుడేనన్నారు. అప్పటి కశ్మీర్ పాలకుడిగా ఉన్న షేక్ అబ్దుల్లా పరిపాలనపై అసంతృప్తితోనే ముఖర్జీ రాజీనామా చేశారని చెప్పారు.

మరిన్ని వార్తలు