జార్ఖండ్ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు ఉండదు: బీజేపీ

26 Oct, 2014 15:02 IST|Sakshi
జార్ఖండ్ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు ఉండదు: బీజేపీ
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ అడుగులేస్తోంది. ఏపార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోకుండానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబార్ దాస్ మీడియాకు వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదు అని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వెంట ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జేడీ(యూ)తో కలిసి బీజేపీ పోటీ చేసి.. 18 సీట్లలో విజయం సాధించింది. 
 
లోకసభ ఎన్నికల పలితాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్ లో 14 సీట్లలో పోటీ చేసి 12 సీట్లను బీజేపీ దక్కించుకుంది. ఐదు దఫాలుగా జరిగే ఎన్నికలు జరుగుతాయన్నారు. నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 14, 20 తేదిలలో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 
>
మరిన్ని వార్తలు