చైనా వద్దంటే నా పరుగు ఆగుతుందా..!

27 Sep, 2017 16:06 IST|Sakshi
వందమీటర్ల పరుగు పందెంలో మన్‌కౌర్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : చండిగఢ్‌ అద్భుతం 101 ఏళ్ల వయసులో కూడా కళ్లు చెదిరేలా పరుగెత్తి మెడల్‌ను సొంతం చేసుకున్న మన్‌కౌర్‌కు నిరాశ ఎదురైంది. ఏషియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నాలనుకున్న ఆమె నెరవేరకుండా పోయింది. ఆమెకు వీసా ఇచ్చేందుకు చైనా నిరాకరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అక్లాండ్‌లో జరిగిన వరల్డ్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో పాల్గొన్న మన్‌ కౌర్‌ 100మీటర్ల పరుగుపందెంలో గెలుపొందారు. అప్పటి నుంచి ఏషియన్‌ మాస్టర్స్‌ చాంపియన్‌ షిప్‌ కోసం పంజాబ్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందారు.

అయితే, చైనా మాత్రం ఆమెకు వీసా ఇచ్చేందుకు నిరాకరించి షాకిచ్చింది. 'నా వీసా అభ్యర్థనను తిరస్కరించారని తెలిసినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా, బాధగా అనిపించింది. మేం ఎప్పటికి వెళ్లినా విజేతలుగా తిరిగొస్తాం.. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఈ విజయంపట్ల నాకు చాలా విశ్వాసం ఉండేది' అని ఆమె చెప్పారు. అయితే, చైనా తనకు వీసాను నిరాకరించినంత మాత్రాన తనపని అయిపోయినట్లు కాదని, మున్ముందు మరిన్ని పోటీల్లో పాల్గొంటానని తెలిపారు.

మరిన్ని వార్తలు