కలర్ స్వాతి అయ్యింది కవయిత్రి

16 Oct, 2014 10:49 IST|Sakshi
కలర్ స్వాతి అయ్యింది కవయిత్రి

 కాదేది కవితకు అనర్హం అంటారు. అలాగే అనుభవాలు నేర్పే పాఠాలు, గుణపాఠాలు ఎన్నో. వాటికి కాస్త పరిజ్ఞానాన్ని, భావుకతను జోడిస్తే వస్తే కథలు, కవితలు కోకొల్లలు. అసలు విషయం ఏంటంటే నటి స్వాతి ఆంగ్లంలో కవితలు రాసేస్తోందట. తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇటీవల ‘‘సమ్ ఐస్ సీ యువర్ వీక్‌నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ప్లై ఫాస్ట్ అండ్ హై’’.
 
 ఇలాంటి పదాలతో ఈ బ్యూటీ రాసిన ఈ కవిత చూస్తుంటే తనకు ఎదురైన అనుభవాలకు కవిత రూపం ఇచ్చినట్టు లేదూ! ఏమైతేనేం ఈ కవితను తన చిత్ర పరిశ్రమ స్నేహితులందరికీ స్వాతి అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీనికి అనూహ్య స్పందన వచ్చినట్లు కూడా ఈ అమ్మడు పేర్కొంది. ఇదంతా చూస్తుంటే స్వాతి త్వరలో గీత రచయిత అయిపోతుందేమోననిపిస్తోందా? అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. తెలుగులో నటించిన కార్తికేయ విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో త్వరలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనుంది.
 

మరిన్ని వార్తలు