24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు

9 Jun, 2020 11:14 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు ఉధృతమవుతూనే ఉన్నాయి. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో 9,987 కేసులు నమోదుకాగా, మహమ్మారి బారినపడి 331 మంది చనిపోయారు. దీంతో మొత్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,66,598కు చేరింది. కాగా.. మృతుల సంఖ్య 7,466కు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1,29,215 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,29,917 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 88,529 కరోనా కేసులు నమోదవ్వగా.. 3,169 మంది చనిపోయాని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. చదవండి: పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ

మరిన్ని వార్తలు