కరెన్సీ కింగ్లు

1 Mar, 2016 05:38 IST|Sakshi
కరెన్సీ కింగ్లు

120 కోట్ల మంది కోసం ప్రవేశపెట్టే దేశ బడ్జెట్ ప్రపంచంలోని మొదటి నలుగురు కుబేరుల ఆస్తితో దాదాపు సమానం. టాప్ 5 బిలియనీర్ల జాబితా పరిశీలిస్తే.. ( రూ. కోట్లలో)

బిల్‌గేట్స్  5,38,560
అమెరికాకు చెందిన బిల్‌గేట్స్ మెక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత.  1995 -2006 మధ్య, 2009లో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

కార్లొస్ స్లిమ్ హెలు  5,24,280
మెక్సికోకు చెందిన ఈ టెలికం దిగ్గజం 2010-13 మధ్య ఫోర్బ్స్ ధనవంతుల్లో చోటు దక్కించుకున్నారు. వారెన్ బఫెట్ ఆఫ్ మెక్సికోగా పేరు పొందారు.

వారెన్ బఫెట్ 4,94,360
ప్రపంచంలో విజయవంత మైన పెట్టుబడిదారుల్లో మొదటిస్థానం అమెరికాకు చెందిన బఫెట్‌దే...  బెర్క్‌షైర్ హతవేకు ఈయన ఛైర్మన్, సీఈవోగా ఉన్నారు.

అమాన్షియో ఓర్టెగా 4,38,600
స్పెయిన్‌కు చెందిన అమాన్షియో.. ఇండిటెక్స్ ఫ్యాషన్ గ్రూపునకు వ్యవస్థాపక ఛైర్మన్.. అక్టోబర్, 2015న ఫోర్బ్స్ బిలియనీర్లలో మొదటిస్థానం దక్కించుకున్నారు.

లారీ ఎల్లిసన్ 3,69,240
అమెరికాకు చెందిన ఎల్లిసన్ ఒరాకిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీటీఓగా ఉన్నారు. ఒరాకిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన సీఈవోగానూ పనిచేశారు.

మరిన్ని వార్తలు