కేరళ గొడవల్లో మరొకరు మృతి

27 May, 2016 20:43 IST|Sakshi

త్రిస్సూర్ః కేరళ ఎన్నికల ఫలితాల తర్వాల స్థానికంగా చెలరేగిన గొడవల్లో మరొకరు మృతి చెందారు. గత శుక్రవారం జరిగిన ఘర్షణలో ఓ బీజేపీ కార్యకర్త చనిపోగా, సరిగ్గా వారం తర్వాత మరో సీపీఎం కార్యకర్త చనిపోయాడు.

మృతుడు 43 ఏళ్ళ చంబన్ శశికుమార్ గతవారం జరిగిన గొడవల్లో తీవ్రంగా గాయపడి, అప్పట్నుంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పట్లో బీజేపీ, సీపీఎం మధ్య ప్రారంభమైన ఘర్షణలో శశికుమార్ కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి కాలును తొలగించిన డాక్టర్లు ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. శశికుమార్ ప్రాణాలు కోల్పోయాడన్న వార్త విన్న సీపీఎం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వక్తం చేశారు. త్రిస్సూర్  జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం బంద్ పాటించారు. అసెంబ్లీ ఎలక్షన్ల ఫలితాలు వెలువడిన తర్వాత త్రిస్సూర్ లో జరిగిన రెండో హత్య ఇది. గత శుక్రవారం ఎలక్షన్ ర్యాలీ జరుగుతుండగా సీపీఎం బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదంలో బీజేపీ కార్యకర్త కు తీవ్ర గాయాలై అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా గత ఆదివారం శశి కుమార్ పై బీజేపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేశారని, తీవ్ర గాయాలతో బాధపడుతున్న అతడిని స్థానికులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు