3 లక్షలు దాటిన పంట రుణానికి వడ్డీ సబ్సిడీ కట్!

25 Apr, 2016 01:13 IST|Sakshi

న్యూఢిల్లీ: రూ. మూడు లక్షలు దాటిన స్వల్పకాలిక పంట రుణాలపై రైతులకు వడ్డీ సబ్సిడీ ఇవ్వరాదని వ్యవసాయ రుణ పథకం మార్గదర్శకాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. అలాగే వడ్డీ సబ్సిడీ రైతులకు ఇచ్చేందుకు ఏడాది లోపు రుణం చెల్లించాలనే నిబంధన సరికాదని పేర్కొంది. ఈ కాలవ్యవధి ఏడాదికి మించి ఉంటే బాగుంటుందని సూచించింది. ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్‌లో పంట రుణాల లక్ష్యాన్ని రూ. 9 లక్షల కోట్లకు పెంచింది. వడ్డీ సబ్సిడీ అందించేందుకు రూ. 15 వేల కోట్లను కేటాయించింది.

ఈ నేపథ్యంలో పంట రుణాలు అవసరమైన చిన్న, సన్నకారు రైతులకు అందించేందుకు, వడ్డీ సబ్సిడీ పథకం సమర్థంగా అమలయ్యేందుకు తగిన మార్గదర్శకాల రూపకల్పనకు నాబార్డ్ మాజీ చైర్మన్ వీసీ సారంగి నేతృత్వంలోని ఓ కమిటీ ఏర్పాైటె ంది. ప్రభుత్వానికి పలు కీలక సిఫార్సులు చేసిన ఈ కమిటీ.. ఇటీవల తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2006-07లో వడ్డీ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రుణాల్లో పెరుగుదల కనిపించిందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా రైతుకు స్వల్పకాలిక రుణం రూ. 3 లక్షలకు మించరాదని.. అంతకు మించి ఇస్తే వడ్డీ సబ్సిడీ ఇవ్వరాదని సూచించింది.

మరిన్ని వార్తలు