ఇలా ఎందుకు? అయోమయంలో ఆనంద్‌ మహీంద్ర: ట్వీట్‌ వైరల్‌

17 Nov, 2023 17:17 IST|Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేకమైన, వినూత్న  వాహనాలు అంటే ఆసక్తి  చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో  పలు రకాల వెహికల్స్‌ గురించి ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేస్తూ ఉంటారు. అధునాతన టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, వింటేజ్‌ ఇలా అనేక రకాల వాహనాల వీడియోలు, చిత్రాలను  పంచు కోవడం ఆయనకు అలవాటు.

తాజాగా ఒక విచిత్రమైన వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. అంతేకాదు  ఆసక్తికరంగా  ఉంది.. కానీ ఇలా ఎందుకు? అంటూ ఒక క్వశ్చన్‌మార్క్‌ వదిలేరు. ఇంకేముంది  ఫ్యాన్స్‌ ఫన్నీ..ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.  ఈ వీడియోలో సాధారణ ట్రాక్టర్‌లా కుండా, ట్రాక్టర్‌లో సీటు ప్లేస్‌మెంట్‌ వెరైటీగా చాలా ఎత్తులో ఉంచారు. సుమారు 7 అడుగుల ఎత్తులో కూర్చున్న డ్రైవర్‌ ట్రాక్టర్‌ను నడుపుతూ  కనిపిస్తాడు. సీటు ఎడ్జస్ట్‌మెంట్‌ కూడా కనిపిస్తోంది. కానీ ఈ సర్దుబాటు వెనుక ఉద్దేశ్యం మాత్రం అస్పష్టం.  దీని పైనే మహీంద్ర  ఆరా తీసారు తన ట్వీట్‌లో. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

బహుశా అతను పంట ఎత్తు ఎక్కువగా ఉన్న పొలంలో ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నాడనుకుంటా..అందుకే అక్కడ కూర్చున్నాడని ఒకరు, ట్రాఫిక్‌ గురించి ముందుగానే తెలుసుకుందామని కొందరు వ్యాఖ్యానించారు. JCB ఆపరేటర్ ట్రాక్టర్ యజమాని లేదా డ్రైవర్ అయితే ఇలానే  ఉంటుందని మరొకరు కమెంట్‌ చేశారు. కాదు. కాదు.. అతను ఇతర ట్రాక్టర్ల కంటే రెండు అడుగులు ముందే ఉండాలనుకుంటున్నాడేమో  అని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు