ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం: డీజీపీ

21 Nov, 2013 21:47 IST|Sakshi
ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం: డీజీపీ

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉందని, భవిష్యత్లో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటామని డీజీపీ ప్రసాద రావు అన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన డీజీపీల సదస్సులో పాల్గొన్న ప్రసాద రావు అనంతరం మీడియాతో మాట్లాడారు.
 
డీజీపీల సమావేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్చించామని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించినట్టు ప్రసాద రావు తెలిపారు. ఎలాంటి సమస్యనయినా క్షేత్రస్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం వచ్చిందని వెల్లడించారు. కాగా ఇదే సమావేశంలో పాల్గొన్న ఐబీ చీఫ్ ఆసిఫ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల భద్రతకు సవాల్ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు