పటేల్ ప్రధాని అయివుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఉండేవి కావు

30 Oct, 2013 15:56 IST|Sakshi
పటేల్ ప్రధాని అయివుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఉండేవి కావు

లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుధ్దం జోరుగా సాగుతోంది. దేశ ప్రథమ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయుంటే దేశ పరిస్థితి ప్రస్తుతం మరోలా ఉండేదని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. పటేల్ ప్రధాని అయివుంటే నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉనికిలో ఉండేవి కావని ఘాటుగా స్పందించారు. గుజరాత్లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

'జవహర్లాల్ నెహ్రూ స్థానంలో పటేల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినట్టయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రస్తుతం ఉండేవి కావు. ఈ విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదు' అని దిగ్విజయ్ అన్నారు. మతహింసను ప్రేరేపించిన ఆర్ఎస్ఎస్పై పటేల్ నిషేధం విధించిన విషయాన్ని మోడీ మరచిపోరాదని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు