‘సిక్కు వ్యతిరేక అల్లర్ల’ పరిహారంపై ఈసీ నిలదీత

8 Nov, 2014 01:45 IST|Sakshi

న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల (1984లో జరిగినవి) బాధితులకు తాజా పరిహారంపై ఎన్నికల సంఘం కేంద్రం తీరును తప్పుబట్టింది. బాధితులకు తాజా పరిహారం ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోకపోతే... మీడియా వార్తలను ఎందుకు ఖండించలేదని సర్కారును నిలదీసింది. ఈ వైఖరితో పరిహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందేమోనన్న అభిప్రాయానికి దారితీస్తుందని ఈసీ  పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావద్దంది.

 

ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు ముందు అక్కడి 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయటంతో. కోడ్ అమల్లో ఉండగా, నాటి సిక్కు అల్లర్ల బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందంటూ వార్తలు రావడంతో ఈసీ కేంద్ర హోంశాఖకు 31న నోటీసులిచ్చింది.

మరిన్ని వార్తలు