దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు

10 Mar, 2019 17:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్‌ ఆరోరా తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 17వ లోక్‌సభ ఎన్నికలకు సుదీర్ఘ కసరత్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేసేముందు  అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మీడియ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలు, పండుగలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఆయన ప‍్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ దిక్సూచిగా ఆయన అభివర్ణించారు.  

దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, 2014 నుంచి ఇప్పటివరకూ 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు అయినట్లు చెప్పారు. ఓటర్‌ సిప్ల్‌లు ఎన్నికలకు ఐదు రోజుల ముందే పంపిణీ చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10  లక్షల పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశామని, అలాగే 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఓటు చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వీవీ ప్యాట్‌లు ఉపయోగిస్తామన్నారు. తుది జాబితా ప్రకటించాక ఓటర్ల జాబితాలో ఇక మార్పులుండని, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ నేటి నుంచి అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఓటర్‌ కార్డుతో పాటు 11 రకాల కార్డులకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించి నిఘా కోసం ఎస్పీలు, కలెక్టర్లతో సదస్సులు నిర్వహిస్తామని సీఈసీ పేర్కొన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు విద్యార్థుల పరీక్షలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఎన్నికల తేదీలు నిర్ణయించడానికి ముందు వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్నామన్నారు. 

ఏప్రిల్‌ 11న జరిగే తొలివిడతలో 20 రాష్ట్రాల్లోని 91 స్ధానాలకు పోలింగ్‌ జరగనుంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 115 స్ధానాలకు, మూడవ దశలో 14 రాష్ట్రాల్లోని 115 స్దానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఇక నాలుగో దశలో 9 రాష్ట్రాల్లోని 71 స్దానాలకు, ఐదో దశలో 5 రాష్ట్రాల్లోని 51 స్ధానాలకు పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఇక ఆరో దశలో ఏడు రాష్ట్రాల్లోని 59 స్ధానాలకు, తుది ఏడవ దశలో 8 రాష్ట్రాల్లోని 59 స్ధానాలకు పోలింగ్‌ జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తొలి దశలోనే ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది.

  • మొదటి విడత 20 రాష్ట్రాల్లో 91 నియోజకవర్గాలు
  • రెండో విడత 13 రాష్ట్రాల్లో 97 నియోజకవర్గాలు
  • మూడో విడత 14 రాష్ట్రాల్లో 115 నియోజకవర్గాలు
  • నాలుగో విడత 9 రాష్ట్రాల్లో 71 నియోజకవర్గాలు
  • ఐదో విడత 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలు
  • ఆరో విడత 7 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు
  • ఏడో విడత 8 రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలు


ఒకే విడతలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తమిళనాడు
అరుణాచల్ ప్రదేశ్
గోవా
గుజరాత్
హర్యానా
హిమాచల్ ప్రదేశ్
కేరళ
మేఘాలయ
మిజోరాం
నాగాలాండ్
పంజాబ్
సిక్కిం
ఉత్తరాఖండ్
అండమాన్ నికోబార్
దాద్రా నగర్ హవేలీ
డయ్యూ డామన్
ఢిల్లీ
పాండిచ్చేరి
చండీగఢ్

రెండు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
కర్ణాటక
మణిపూర్
రాజస్థాన్
త్రిపుర

మూడు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
అసోం
ఛత్తీస్ గఢ్

నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
జార్ఖండ్
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
ఒడిశా

ఐదు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
జమ్మూకాశ్మీర్

ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు
బీహార్
ఉత్తరప్రదేశ్
పశ్చిమ బెంగాల్

>
మరిన్ని వార్తలు