‘మీడియాకు అదే పెద్ద సవాల్‌’

16 Nov, 2018 19:13 IST|Sakshi

సమాచారాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు : అరుణ్‌జైట్లీ

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పత్రికా దినోత్సవం (నవంబర్‌ 16) సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. జూరీ ఎంపిక చేసిన జర్నలిస్టులకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. హిందూ పత్రిక చైర్మన్ ఎన్‌ రామ్‌కు ఆయన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డును అందజేశారు. అవార్డులు పొందిన వారికి  అరుణ్ జైట్లీ, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు, జ్యూరీ కన్వీనర్‌ దేవులపల్లి అమర్‌ అభినందనలు తెలిపారు. సమావేశంలో జైట్లీ ప్రసంగించారు. ఈ టెక్నాలజీ యుగంలో సమాచారాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. టెక్నాలజీ ప్రెస్ సెన్సార్ షిప్ ను అనుమతించదని తెలిపారు. 

‘మీడియా తన విశ్వసనీయతను తిరిగి పొందడం అనేది ప్రస్తుతం ఉన్న అసలైన సవాల్‌’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. మీడియా దుర్వినియోగం అయితే దాని మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.‘ఎన్‌ రామ్‌కు రామ్మోహన్ రాయ్ పేరుతో అవార్డు ఇవ్వడం నాకు గౌరవప్రదంగా ఉంది. ఇది మరింత బాధ్యతను పెంచే విధంగా ఉంది’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు