నాడు రూ.12 కోట్లు.. నేడు రూ.4కోట్లు

16 Nov, 2018 19:14 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్‌ రత్నం

సాక్షి, చేవెళ్ల: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కేఎస్‌ రత్నం సమర్పించిన అఫిడవిట్‌ వివరాలిలా ఉన్నాయి. గత ఎన్నికల్లో, ఇప్పటి ఎన్నికల్లో సమర్పించిన ఆస్తుల్లో తగ్గుదల కనిపించింది. అప్పులు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2014 ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో  ఆయనతోపాటు భార్య పిల్లలకు సంబంధించిన ఆస్తుల వివరాలను అందించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనతో పాటు భార్య పేరుపై ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను మాత్రమే అందజేశారు. పిల్లల వివరాలను  జతచేయటకపోవటంతో ఆస్తుల విలువ తగ్గింది.   

కెఎస్‌.రత్నం ప్రకటించిన 2014 అఫిడవిట్‌లో మొత్తం ఆస్తులు రూ.12 కోట్ల 34లక్షల 80వేలుగా  ప్రకటించారు. 2018లో రూ. 4కోట్ల 9లక్షల 41వేల 252రూపాయలుగా  ప్రకటించారు. 2014లో సిర్థాస్తులు రూ. 11, 80,00,000 కాగా చరాస్తులు రూ. 54,80,000గా  తెలిపారు. అప్పులు 33 లక్షలుగా చూపించారు. 2018 ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల వివరాల్లో   స్థిరాస్తులు రూ.3,51,83,500, చారాస్తులు  57,57,752లుగా ప్రకటించారు.  అప్పులు రూ.52,40,546 ఉన్నట్లుగా ప్రకటించారు. గత ఎన్నికల్లో  రెండు కార్లు మాత్రమే ఉండగా ఇప్పుడు  మూడు కార్లు ఉన్నట్లుగా వెల్లడించారు. 

మరిన్ని వార్తలు