నల్ల ధనం వెల్లడికి 4 నెలలు

1 Mar, 2016 04:14 IST|Sakshi

న్యూఢిల్లీ: లెక్కల్లో చూపని ఆదాయాలు, ఆస్తులు స్వచ్ఛందంగా వెల్లడించాలనుకునే వారికి నాలుగు నెలల వ్యవధి ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ వ్యవధిలో సదరు నల్లధనానికి సంబంధించి పన్నులు, పెనాల్టీలు కట్టిన వారిపై తదుపరి ప్రాసిక్యూషన్ తదితర చర్యలు ఉండబోవని తెలిపారు. ఇటువంటి బ్లాక్‌మనీపై 30 శాతం పన్నులు, 7.5 శాతం సర్‌చార్జీ, 7.5 శాతం పెనాల్టీ ఉంటుందని (మొత్తం 45 శాతం) మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు