ఓ కూతురి స్పందన ఇది: సీఎం

1 Apr, 2020 10:40 IST|Sakshi

చిన్నారి వీడియోకు ఫిదా అయిన అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి

ఇటానగర్‌: ‘‘ప్రధాని బయటకు వెళ్లకూడదని చెప్పారు కదా. ఎక్కడికీ వెళ్లొద్దు నాన్నా’’ అంటూ ఓ చిన్నారి తన తండ్రితో సంభాషించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆవశ్యకతను ఎంత చక్కగా చెప్పిందో అంటూ ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజా రవాణా సహా దాదాపు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. నిత్యావసర వస్తువుల కోసం మినహా బయటకు వెళ్లకూడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబంతో కలసి సమయాన్ని గడుపుతున్నారు.(కార్మికుడిపై పూల వర్షం.. నోట్ల దండలు!)

ఈ క్రమంలో ఓ రోజు ఆఫీసుకు వెళ్తున్నానంటూ తన కూతురితో చెప్పగా.. ఆమె వద్దంటూ వారించింది. తలుపులకు అడ్డుగా నిలబడి తండ్రిని ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతూ ముఖ్యమంత్రిని కూడా చేరింది. దీంతో ఈ చిన్నారి వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ.. ‘‘ తన తండ్రిని ఆఫీసుకు వెళ్తున్నట్టు నటించగా... ఓ కూతురి స్పందన ఇది. తండ్రి బయటకు వెళ్లకుండా తనే తలుపులు మూసివేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తిని తండ్రికి గుర్తు చేసింది. ఈ అరుణాచల్‌ ప్రదేశ్‌ చిన్నారి కంటే ఎవరికి ఎక్కువగా లాక్‌డౌన్‌ ఆవశ్యకత తెలుసునంటారు’’ అని ఆమెపై ప్రశంసలు కురిపించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా