‘స్విస్‌ నల్లధనం’ వివరాల సేకరణ

28 Nov, 2016 16:03 IST|Sakshi
‘స్విస్‌ నల్లధనం’ వివరాల సేకరణ

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లోని నల్లధనాన్ని గుర్తించేందుకు భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ‘నల్ల ఖాతాదారుల’ వివరాలు ఇవ్వాలంటూ ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటిదాకా స్విట్జర్లాండ్‌కు 20వినతులను సమర్పించింది. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం దాచారనే అనుమానం ఉన్న వారి పేర్లతో జాబితా తయారుచేసి, వారి ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా స్విట్జర్లాండ్‌ను కోరింది.

2018 సెప్టెం బరు నుంచి భారతీయుల స్విస్‌ ఖాతాల వివరాలను ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు వీలుగా స్విట్జర్లాండ్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలి గణాంకాల ప్రకారం స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయిలో తగ్గిపోయింది.

మరిన్ని వార్తలు