చదవేది పదో తరగతి.. చేసేది బడా స్మగ్లింగ్

10 Oct, 2014 14:55 IST|Sakshi
చదవేది పదో తరగతి.. చేసేది బడా స్మగ్లింగ్

బరంపురం: స్కూలు కెళ్లి బుద్ధిగా చదుకోవాల్సిన ఓ పిల్లాడు చిన్నతనంలో బడా స్మగ్లర్గా మారాడు. కోట్లాది రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలు అక్రమ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఒడిశాలోని ముషీరాబాద్ జిల్లా లాల్గోలాలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఈ నేరానికి పాల్పడ్డాడు.

చిన్న పిల్లల ఆహారం పాకెట్లలో  మూదు కిలోల హెరాయిన్ను బంగ్లాదేశ్కు తరలిస్తుండగా పట్టుబడినట్టు ముషీరాబాద్ ఎస్పీ హుమయూన్ కబీర్ చెప్పారు. హెరాయిన్ విలువ మూడు కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. విద్యార్థితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. అతను చాలా కాలం నుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నా, పిల్లాడు కావడంతో పోలీసులు అనుమానించలేదు. చివరకు పోలీసులకు పట్టబడి జైలుపాలయ్యాడు. కోర్టులో హాజరుపరచగా 14 రోజలకు పోలీస్ కస్టడికి ఆదేశించారు.

మరిన్ని వార్తలు