నిన్నటి భూకంపంకంటే వంద రెట్ల శక్తి దాగుంది : ప్రొఫెసర్ శంకర్

26 Apr, 2015 17:38 IST|Sakshi
నిన్నటి భూకంపంకంటే వంద రెట్ల శక్తి దాగుంది : ప్రొఫెసర్ శంకర్

న్యూఢిల్లీ:  నిన్న నేపాల్లో సంభవించిన భూకంప శక్తి వంద మిలియన్  టన్నుల టీఎన్టీ(ట్రై నైట్రో టోల్యూన్)కి సమానం అని ఖరగ్పూర్ ప్రొఫెసర్ శంకర్ చెప్పారు. హిమాలయాల కింద నిన్నటి భూకంప శక్తి కంటే వంద రెట్ల ఎక్కువ శక్తి దాగుందన్నారు. హిందుకేష్ రీజియన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భూకంపం వచ్చే జోన్ అని ఆయన తెలిపారు. ఈ 2500 కిలో మీటర్ల హిమాలయాల పరిధిలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చని ఆయన చెప్పారు. హిమాలయాల పరిధిలో వచ్చే భూకంపాలు ఒక్కోసారి రిక్టర్ స్కేల్పై 9 కూడా దాటవచ్చునని ప్రొఫెసర్ శంకర్ చెప్పారు.

నేపాల్కు మరోభారీ భూకంపం పొంచి ఉందని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాజీ డైరెక్టర్ హరీష్‌ గుప్తా చెప్పారు. ఇప్పుడు వచ్చింది భారీ భూకంపమే, అయితే మరిన్ని భూకంపాలకు అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా, నేపాల్లో ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కూడా మళ్లీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 6.7గా నమోదైంది. ఖట్మండుకు 65 కిలో మీటర్ల దూరంలోని కొడారి కేంద్రంగా తాజా భూకంపం సంభవించింది.

మరిన్ని వార్తలు