ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు

6 Nov, 2023 16:55 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధానితో సహా ఉత్తర భారతంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం సాయంత్రం 4:18 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. నేపాల్‌ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతంలో భూమి వణికింది.

గత నాలుగు రోజుల్లో వరుసగా మూడో సారి భూమి కంపించింది. ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో సామాగ్రి కిందపడిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు తెలిపారు.  

ఇదీ చదవండి: మహిళా అధికారి హత్య కేసులో మాజీ డ్రైవర్ అరెస్టు

మరిన్ని వార్తలు