ఇక కాల్పులు ఆపేద్దాం

30 May, 2018 04:55 IST|Sakshi

న్యూఢిల్లీ / ఇస్లామాబాద్‌: భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌(డీజీఎంవో) అంగీకరించారు. ఇరుదేశాల మధ్య నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో పాటించేందుకు అంగీకరించినట్లు భారత ఆర్మీ తెలిపింది. సరిహద్దులో ఒకవేళ ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే హాట్‌లైన్‌తో పాటు ఫ్లాగ్‌ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి.

మరిన్ని వార్తలు