ఆకర్షణలో మన స్థానం 81

8 Feb, 2018 19:30 IST|Sakshi
గ్లోబల్‌ టాలెంట్‌ కాంపిటేటివ్‌నెస్‌ ఇండెక్స్‌లో 81 స్థానంలో నిలిచిన భారత్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఏ దేశం అయినా అభివృధ్ది సాధించాలంటే అన్నింటికన్న అతి ముఖ్యమైనవి మానవ వనరులు. నైపుణ్యం గల మానవ వనరులు ఉన్న దేశం ప్రతిదాంట్లో ముందుంటుంది. సొంత దేశంలో మానవ వనరుల కొరత ఉన్న, ఇతర దేశాల్లో ప్రతిభ ఉన్న యువతను ఆకర్షించి దేశ అభివృధ్ది కోసం ఉపయోగించుకుంటూనే వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నాయి ప్రపంచదేశాలు.

అలా ప్రతిభను ఆకర్షిస్తున్న దేశాలు ఏవి, అలా ఆకర్షించిన ప్రతిభను నిలుపుకుంటున్నాయా అనే అంశాలపై గత ఆరు సంవత్సరాలుగా గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ (జీటీసీఐ) అనే సంస్థ 119 దేశాలు, 90 ప్రధాన నగరాల్లో ఓ సర్వే నిర్వహించింది. ఈ నివేదికను వరల్డ్‌ ఎకానామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశంలో విడుదల చేసింది. అపారమైన మేధోసంపత్తి కలిగిన మన దేశం ఇందులో ఎంతో వెనుకబడి ఉంది.

జీటీసీఐ సర్వే ప్రకారం ఆకర్షించిన ప్రతిభను నిలుపుకుంటున్న దేశాల్లో మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. రెండు, మూడు స్థానాలను సింగపూర్‌, అమెరికా అక్రమించాయి. ఈ క్రమంలో భారత్‌ 81వ స్థానంలో నిలిచింది. మన తర్వాతి 82 స్థానంలో శ్రీలంక ఉంది. కేవలం ప్రతిభ ఉన్న వారిని ఆకర్షించడమే కాకుండా వైవిధ్యమైన ప్రతిభలను కలిపి సరికొత్త ఉత్తేజ ప్రతిభను అభివృధ్ది చేయడానికి శ్రమను ఉపయోగించాలని, అలా చేయడం సులభమైన విషయం కానప్పటికీ నిబద్ధతతో అభివృద్ధి సాధించాలని నివేదిక పేర్కొంది.

మన దేశంలో ప్రపంచంలోనే ఎక్కువ యువశక్తిని వనరులను కలిగి ఉంది. అమెరికా లాంటి దేశాలు మన దేశ ప్రతిభను చాలా సంవత్సరాలుగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇలా విదేశాలకు తరలిపోతున్న మన మేథస్సుకు అవసరమైన విద్యా, వ్యాపార అవకాశాలను కల్పిస్తే భారత్‌ కూడా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది.

మరిన్ని వార్తలు