ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఉద్యోగం

10 Nov, 2023 06:29 IST|Sakshi

రాజస్తాన్‌ ప్రభుత్వ వైద్యుడికి హైకోర్టు వెసులుబాటు   

జైపూర్‌: రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వ డాక్టర్‌ దీపక్‌ ఘోగ్రా(43)కు రాష్ట్ర హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరడానినికి అంగీకరించింది. దీపక్‌ భారతీయ ట్రైబల్‌ పార్టీ టికెట్‌పై దుంగార్పూర్‌ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు.

పరాజయం పాలైతే ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో దీపక్‌ ఓడిపోతే మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు