లదాఖ్‌లో భారత్, చైనా బాహాబాహీ

13 Sep, 2019 04:59 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

న్యూఢిల్లీ: లదాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా బలగాల మధ్య బుధవారం ఉద్రిక్తత తలెత్తింది.  అయితే, చర్చల అనంతరం సాయంత్రానికి ఉద్రిక్తత సమసింది. పాంగోంగ్‌ త్సో సరస్సు ఒడ్డున బుధవారం ఉదయం భారత్‌ బలగాలు పహారా కాస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. తర్వాత, చైనా బలగాలు పోట్లాటకు దిగాయి. దీంతో రెండు వైపులా పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతంలో బలగాలను మోహరించాయి. దీంతో రెండు దేశాల సైనిక ప్రతినిధులు చర్చించి ఓ అంగీకారానికి వచ్చారు. సాయంత్రానికి ఎవరికి వారు     బలగాలను ఉపసంహరించుకోవడంతో    ఉద్రిక్తత సడలింది.

>
మరిన్ని వార్తలు