జీశాట్‌–11 ప్రయోగానికి ఇస్రో గ్రీన్‌సిగ్నల్‌

18 Jun, 2018 06:38 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీశాట్‌–11 ప్రయోగానికి అనుమతి ఇచ్చింది. ఫ్రెంచ్‌గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి మే 26న ప్రయోగించాల్సిన 5,700 కేజీల బరువున్న జీశాట్‌–11 ప్రయోగాన్ని ఇస్రో ఇంతకుముందు నిలిపివేసింది. ఈఏడాది మార్చిలో ప్రయోగించిన జీశాట్‌–6ఏ విఫలమైన నేపథ్యంలో మరిన్ని పరీక్షలు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిస్థాయిలో అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉపగ్రహం దోషరహితంగా ఉండటంతో ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే ‘ఏరియన్‌ స్పేస్‌’ సంస్థ స్లాట్‌ దొరకగానే జీశాట్‌–11ను కక్ష్యలో ప్రవేశపెడతామని ఇస్రో పేర్కొంది.

మరిన్ని వార్తలు